Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
మార్చి 25న ఉత్తర అమెరికాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్రాండ్ ప్రీమియర్స్

మార్చి 25న ఉత్తర అమెరికాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్రాండ్ ప్రీమియర్స్

Panthagani Anusha
1 మార్చి, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉత్తర అమెరికా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్ర ఓవర్సీస్ పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ ‘ప్రత్యంగిర సినిమాస్’ కైవసం చేసుకుంది. ఇప్పటికే పవర్‌స్టార్ నటించిన ‘హరి హర వీర మల్లు’, ‘ఓజీ’ చిత్రాలను పంపిణీ చేసిన ఈ సంస్థ వరుసగా మూడవసారి ఆయనతో జతకట్టడం విశేషం. ఈ మేరకు విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్రీన్ గ్లాసెస్ ధరించి చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తుండగా శ్రీలీల ఆశ్చర్యంగా ఆయన వైపు చూడటం అభిమానులను ఆకట్టుకుంటోంది.

దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి 26, 2026న విడుదల కానుండగా ఉత్తర అమెరికాలో ఒక రోజు ముందుగానే అంటే మార్చి 25న గ్రాండ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

గతంలో విడుదలైన ‘ఓజీ’ చిత్రం ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 5.5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్లు, హై-ఎనర్జీ సాంగ్స్ సృష్టించిన హైప్‌తో అమెరికాలో మరోసారి వసూళ్ల సునామీ ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మార్చి 25న ఉత్తర అమెరికాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్రాండ్ ప్రీమియర్స్ - Tholi Paluku