Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
నేడు ‘సూర్య 46’.. టైటిల్, ఫస్ట్ లుక్

నేడు ‘సూర్య 46’.. టైటిల్, ఫస్ట్ లుక్

Gaddamidi Naveen
1 మార్చి, 2026

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సూర్య 46’ గురించి చిత్రబృందం క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మార్చి 2న ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

ఇటీవల కాలంలో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న సూర్య, ఈసారి మనిషిలోని భావోద్వేగాలను పండించే ఒక చక్కని కుటుంబ కథా చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. గత ఏడాది చివరలోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ ద్విభాషా తమిళం, తెలుగు చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. చిత్రాన్ని 2026 వేసవి కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.వెంకీ అట్లూరి మార్కు క్లాసిక్ ఫీల్, సూర్య నటన తోడవ్వడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

నేడు ‘సూర్య 46’.. టైటిల్, ఫస్ట్ లుక్ - Tholi Paluku